ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Two dead and one misiing after drowning at Perupalem beach పేరుపాలెం బీచ్‌లో మునిగిపోయిన పర్యాటకులు..! ఇద్దురు మృతి.. మరొకరు గల్లంతు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 7:50 PM IST

two_died

Two Died and One Browned in Sea:పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్‌లో కొట్టుకుపోయి ఇద్దరు మృతి చెందారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకీి వెళ్తే.. తణుకు, బాదంపూడి, వీరబధ్రపురానికి చెందిన ఐదుగురు మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్‌కు వెళ్లారు. అక్కడ సముద్రంలో స్నానానికి దిగిన సమయంలో అలలు ఉద్ధృతికి ఐదుగురూ కొట్టుకుపోయారు. వారిలో రఘువర్మ, శ్రావణి, తన్మయి అనే ముగ్గురిని కాపాడి నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రఘువర్మ ప్రాణాలు కోల్పోయారు. గల్లంతైన వారిలో సావిత్రి అనే మహిళ మృతదేహం లభ్యమవగా వసంత కుమార్ కోసం గాలిస్తున్నారు. నరసాపురం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం శ్రావణి, తన్మయిని భీమవరం తరలించారు.

గడచిన రోజున ఇదేరీతిలో తణుకుకు చెందిన నలుగురు యువకులు విహార యాత్రకు వెళ్లగా గోపాలపురం వద్దనున్న గౌతమీ గోదావరిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా.. తెల్లవారుజామున గోదావరిలో గల్లంతైన నలుగురు యువకుల మృతదేహాలను గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details