ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tribal Welfare Association on Gurukulam Societies Funds Scam: గురుకులం సొసైటీల నిధులు రూ.40 కోట్లు దారి మళ్లాయి: గిరిజన నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 7:54 PM IST

tribal_cultural_welfare

Tribal Welfare Association on Gurukulam Societies Funds Scam:కేంద్రం నుంచి వచ్చిన నిధులు సుమారు 40 కోట్లు దొంగ బిల్లులతో మంగళగిరి గురుకులం సొసైటీలో పనిచేస్తున్న అధికారులు, మధ్యవర్తుల ద్వారా వారి ఖాతాలకు మళ్లించుకున్నారని గిరిజన సాంస్కృతిక సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మన్న దొర ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గురుకులం సొసైటీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు 40 కోట్ల రూపాయలను అధికారులు ఈఎంఆర్ఎస్ (EMRS), మినీ గురుకుల స్కీములు మధ్యవర్తుల ద్వారా తమ ఖాతాలకు మళ్లించుకున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిధుల కుంభకోణంపై ఇప్పటికే పలుమార్లు స్పందనలో ఫిర్యాదులు చేసినా చర్యలు ఫలితం లేదని అన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం చూస్తుంటే దీని వెనుక పెద్దల హస్తం కూడా ఉందని అనుమానాలు ఉన్నాయన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన అధికారులకు ఉన్నత పదవులు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details