ఆంధ్రప్రదేశ్

andhra pradesh

AP HC on R5 Zone ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై పిటిషన్లు.. నేడు తీర్పు వెల్లడించనున్న హైకోర్టు

By

Published : Aug 3, 2023, 10:00 AM IST

hc on r5 zone

Today High Court Judgement on R5 Zone Issue: ఆర్‌-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై.. ఇవాళ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెల్లడించనుంది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ D.V.S.S సోమయాజులు, జస్టిస్‌ C.H మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరితో కూడిన త్రిసభ్య ధర్మాసనం అనుబంధ పిటిషన్లపై ఉత్తర్వులు ఇవ్వనుంది. రాజధానేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు, 14 వందల రెండు ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు, హడావుడిగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ ఐకాస అధ్యక్షుడు చిలకా బసవయ్య, నిడమర్రు గ్రామానికి చెందిన కె. శ్రీనివాసరావు, కె.పద్మావతి మరికొందరు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. రైతుల అనుబంధ పిటిషనర్లపై ఇటీవల విచారణ జరుపగా తుది నిర్ణయాన్ని నేటికి వాయిదా వేస్తూ త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details