ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Discrimination against capital farmers : రాజధాని రైతులపై కక్ష..! భూముల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష..

By

Published : May 25, 2023, 10:25 AM IST

Discrimination against capital farmers : వివక్ష లేకుండా.. అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ.. ముఖ్యమంత్రి జగన్‌.., సందర్భం చిక్కినప్పుడల్లా ఉపన్యాసాలిస్తుంటారు. కానీ అమరావతి ప్రాంతమన్నా, రాజధానికి భూములిచ్చిన రైతులన్నా ఆయనకు మొదట్నుంచీ అలవిమాలిన వివక్ష అనేది.. ఆయన విధానాల ద్వారానే స్పష్టమవుతుంది. రైతులకు ఇచ్చిన ప్లాట్ల అభివృద్ధిని నాలుగేళ్లుగా గాలికొదిలేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పేదలకు సెంటు భూమి విషయంలో యుద్ధప్రాతిపదికన పనులు చేస్తుండటమే దీనికి తాజా నిదర్శనం. రైతులకు కేటాయించిన ప్లాట్లను 6 నెలల్లో అభివృద్ధి చేసి ఇవ్వాలన్న హైకోర్టు తీర్పును పక్కనపెట్టి.. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ.. ఆగమేఘాల మీద ఆర్‌-5 జోన్‌ను అభివృద్ధి చేయడంపై.. అమరావతి రైతులు తీవ్ర నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26న ముఖ్యమంత్రి జగన్‌ రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో.. రైతుల ప్లాట్లు, సెంటు భూమి లేఅవుట్ల వద్ద ప్రస్తుత పరిస్థితిపై.. మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్‌ అందిస్తున్న క్షేత్రస్థాయి కథనం.

ABOUT THE AUTHOR

...view details