ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tension in Jaganannaku Chebudam Programme: జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఎందుకు చెప్పారంటూ.. వైసీపీ నేత వీరంగం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2023, 5:24 PM IST

Tension_in_Jaganannaku_Chebudam_Programme

Tension in Jaganannaku Chebudam Programme:గుంటూరు జిల్లాలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కనీస సౌకర్యాలు, మౌలిక వసతుల కొరత అధికంగా ఉందని పెదనందిపాడు గ్రామస్థులు అధికారులను నిలదీయటంతో.. కలుగజేసుకున్న వైసీపీ నేత గ్రామస్థులతో వాదనకు దిగాడు. 

గుంటూరు జిల్లా పెదనందిపాడులో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదనందిపాడు గ్రామస్థులు.. గ్రామంలో తాగునీరు తాగడానికి పనికిరాకుండా ఉన్నాయని గ్రామస్థులు అధికారులకు మొరపెట్టుకున్నారు. దుర్వాసన వస్తున్నాయని బాటిల్లలో పట్టిన గ్రామస్థులు.. టీడీపీ నేతలు జేసీ రాజకుమారికి ఆ బాటిళ్లను చూపించారు. సమస్య తెలుసుకున్న జేసీ పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ క్రమంలో వైసీపీ నాయకుడు  ఖాసిం పీరా అనే వ్యక్తి గ్రామస్థులతో వాదనకు దిగాడు. తాగునీరు అడిగితే వాగ్వాదానికి దిగటం ఏంటనీ గ్రామస్థులు వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అక్కడే పోలీసులు గ్రామస్థులకు, వైసీపీ నాయకులకు సర్థి చెప్పి.. అక్కడి నుంచి పంపించివేయటంతో వివాదం సద్దుమణిగింది. 

ABOUT THE AUTHOR

...view details