ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Telugu people strike in tamil nadu: తమిళనాడులో ఊపందుకున్న ‘ బాబుతో మేము..’ నినాదాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 4:03 PM IST

Updated : Sep 24, 2023, 4:30 PM IST

Telugu people strike in tamil nadu

Telugu people strike in tamil nadu:  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్​కు నిరసనగా ఇప్పటికే... రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ వివిధ వర్గాలు, వృత్తుల వారు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే... తాజాగా... తమిళనాడు రాష్ట్రంలో సైతం చంద్రబాబు అరెస్ట్​కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ తమిళనాడులోని తెలుగుప్రజలు నిరసన (Telugu people strike) కార్యక్రమాలు చేపడుతున్నారు. 

చంద్రబాబుకు మద్దతుగా తమిళనాడులో(Tamil nadu) ఆందోళనలు కోనసాగుతున్నాయి. తిరువళ్లూరు జిల్లా పరిధిలోని వివిథ నియోజకవర్గాలకు చెందిన తెలుగు సంఘాల ప్రజలు పల్లిపట్టులో నిరసన చేపట్టారు. పల్లిపట్టు అంబేడ్కర్‍ కూడలి వద్ద బైఠాయించారు. ఐ ‘వియ్‌ స్టాండ్‌ విత్‌ సీబీఎన్‌’ (We stand with CBN) అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రానికి మాత్రమే నాయకుడు కాదని.. తెలుగు ప్రజలందరికి నాయకుడని తమిళనాడులో స్ధిరపడిన తెలుగు ప్రజలు అన్నారు. స్కిల్‍ డెవలప్‍ మెంట్‍(skill development) పథకం ద్వారా శిక్షణ పొందిన పలువురు యువకులు ఐటీ నిపుణులుగా చెన్నై, బెంగళూరు నగరాలలో స్ధిరపడ్డారని అన్నారు. ఎలాంటి తప్పు చేయని నేతపై కేసులు పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబుపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. చంద్రబాబునాయుడికి మద్దతుగా తమిళనాడు నుంచి చలో రాజమండ్రి కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. తమిళనాడు వ్యాప్తంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతో పాటు తెలుగు వారు స్ధిరపడిన ప్రాంతాలలో ఆందోళనలు కొనసాగిస్తామని తెలిపారు. 

Last Updated :Sep 24, 2023, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details