ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్​ చేసి పెళ్లి చేసుకున్న ఉపాధ్యాయుడు - ఆ తర్వాత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 6:46 PM IST

teacher_harrasment_on_student_in_bhimavaram

Teacher Harrasment on Student in Bhimavaram : తరగతి గదిలో పాఠాలు బోధించాల్సిన ఓ ఉపాధ్యాయుడు అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై కన్నేసి ప్రేమ పేరుతో మోసగించాడు. బాలికను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెకు తాళి కట్టాడు. పెళ్లైందని చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలు ఇలా ఉన్నాయి..

Teacher Minor Girl Marriage in BVRM: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామీణ మండలం తాడేరు గ్రామానికి చెందిన పురెళ్ల సోమరాజు.. జిల్లాలోని మరో మండలంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్నారు.  ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి అక్కడే చదువుతున్న ఒక విద్యార్థినిని ఈ నెల 19న ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని తన స్వగ్రామం తాడేరుకు తీసుకెళ్లారు. అక్కడే తాళి కట్టి పెళ్లైందని చెప్పారు.  ఆ తరువాత అత్యాచారానికి పాల్పడ్డారు.  ఈ విషయమై బుధవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సోమరాజుపై అత్యాచారం, పోక్సో, బాల్య వివాహ నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కోసం దిశ డీఎస్పీ ఎన్‌. మురళీకృష్ణను నియమిస్తూ ఎస్పీ రవిప్రకాశ్‌ ఆదేశాలు జారీ చేశారని ఆకివీడు సీఐ కె. సత్యనారాయణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details