ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నెల్లూరు ఘటన మరువకముందే మరొకటి, ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఉపాధ్యాయుడి దాడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 11:19 AM IST

Teacher_Attack_on_RTC_Bus_Driver

Teacher Attack on RTC Bus Driver: ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్​పై దాడి చేసిన ఘటన మరువకముందే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో మరో ఘటన చోటుచేసుకుంది. పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం నాగలగుట్టపల్లి వద్ద బస్సు.. పాఠశాల వద్ద నిలపలేదనే నెపంతో ఆర్టీసీ డ్రైవర్​పై ఉపాధ్యాయుడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. రాయచోటి నుంచి వేంపల్లికి వస్తున్న ఆర్టీసీ బస్సు.. నాగలగుట్టపల్లి పాఠశాల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ డ్రైవర్‌ నిలపకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయుడు రామ్మోహన్.. బైక్​పైన ఆర్టీసీ బస్సును వెంబడించి.. మధ్యలో బస్సును ఆపాడు. బస్సులోకి ఎక్కిన తర్వాత డ్రైవర్​ని ఇష్టానుసారం బూతులు తిడుతూ దాడి చేశాడు. అంతటితో ఆగకుండా డ్రైవర్​ను బస్సు నుంచి బయటకు లాగి.. కింద పడేసి కాళ్లు చేతులతో తొక్కుతూ దాడికి పాల్పడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ నరసింహులుపై ఉపాధ్యాయుడు రామ్మోహన్ దాడికి పాల్పడిన విషయం తెలుసుకున్న పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉపాధ్యాయుడిది పులివెందుల ప్రాంతమని గుర్తించారు. దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్ నరసింహులు చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details