ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leaders Protests on CBN Arrest Across AP: 'బాబుతో మేము సైతం' రాష్ట్ర వ్యాప్తంగా నినాదాల హోరు.. నిరసనల జోరు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 3:56 PM IST

TDP_Leaders_Protests_on_CBN_Arrest_Across_AP

TDP Leaders Protests on CBN Arrest Across AP: 'బాబుతో మేము సైతం' అంటూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసనలతో హోరెత్తుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో రిలే నిరనన దీక్షలు 24వరోజు కొనసాగుతున్నాయి. పెదవడ్లపూడికి చెందిన సుమారు 150 కుటుంబాలు దీక్షలో పాల్గొన్నాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో కల్లు, గీత కార్మికులు కుండలపై 'బాబు కోసం మేము సైతం' అంటూ అక్షరాలతో నిరసన తెలిపారు. 

చంద్రబాబు త్వరగా విడుదల కావాలని అనంతపురంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 'సైకో పోవాలి సైకిల్‌ రావాలి' అంటూ కోనసీమ జిల్లా పి గన్నవరంలో టీడీపీ నేతలు నినాదాలు చేశారు. చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమకేసు నుంచి క్షేమంగా రావాలని.. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఇంద్రకీలాద్రి అమ్మవారికి పూజలు నిర్వహించారు. టీఎన్ఎస్​ఎఫ్ విద్యార్థులు పొట్లూరి దర్షిత్, రేపాకుల శ్రీనివాస్​లు విజయవాడలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడవరోజుకు చేరింది. రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి చంద్రబాబు అని వారు కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details