ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leaders Protests in Srikakulam: చంద్రబాబుకు మద్దతుగా తిరగబడ్డ సిక్కోలు.. ఎక్కడికక్కడ అణచివేస్తున్న పోలీసులు..

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 3, 2023, 7:00 PM IST

TDP Leaders Protests in Srikakulam

 TDP Leaders Protests in Srikakulam:  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అరెస్ట్ అక్రమం అంటూ టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి చంద్రబాబు(Chandrababu)కు మద్దతుగా నిలుస్తున్నారు. మేమంతా బాబు వెంటే అంటూ ప్లకార్డులతో.. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అరెస్ట్​కు వ్యతిరేకంగా నిరసనలు చేసేవారిపై... ప్రభుత్వం పోలీస్​ చర్యలతో అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. 

శ్రీకాకుళం (Srikakulam)లో టీడీపీ నాయకులు తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీ చేసేందుకు వెళ్లిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ను 80 అడుగుల రోడ్డు వద్ద అడ్డుకున్నారు. పోలీసులు అశోక్ అనుచరులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే జిల్లాలోని టీడీపీ(TDP) ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. 80 అడుగుల రహదారిలో ఎవరినీ పోలీసులు అనుమతించ పోవడంతో... ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు నిరసన చేసుకునే హక్కును సైతం ప్రభుత్వం కాలరాస్తుందని టీడీపీ నేతలు ఆరోపించారు.  పోలీసుల తీరుపై టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details