ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP leader Kilaru Rajesh attended CID inquiry: సీఐడీ విచారణకు హాజరైన కిలారు రాజేష్.. తాను ఎక్కడికీ పారిపోలేదని వెల్లడి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 16, 2023, 11:01 PM IST

TDP leader Kilaru Rajesh attended CID inquiry

TDP leader Kilaru Rajesh attended CID inquiry: చంద్రబాబుని నేరుగా ఎదుర్కోలేక స్కిల్ ప్రాజెక్టులో అవినీతి అంటూ వైసీపీ కట్టు కథ అల్లిందని తెలుగుదేశం పార్టీ నేత కిలారు రాజేష్ ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆరోగ్యం పైనే అందరిలోనూ బాధ ఉందన్నారు. స్కిల్ ప్రాజెక్ట్ పై సిట్ కార్యాలయంలో కిలారు రాజేష్ సీఐడీ విచారణ ముగిసింది. రేపు మరోసారి విచారణకు రావాలని సిఐడి అధికారులు నోటీసు ఇచ్చారన్నారు. 10ప్రశ్నలు స్కిల్ డెవలప్మెంట్ పైనా, మిగిలినవి వ్యక్తిగత విషయాలు ప్రశ్నించారని విచారణ అనంతరం రాజేష్ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లో తన ప్రమేయం లేదు అని స్పష్టం చేశారు. మొత్తం గా ఇవాళ 25 ప్రశ్నలు తనని అడిగారని కిలారు వెల్లడించారు. విచారణ న్యాయవాది సమక్షంలో జరిగిందన్నారు. పారిపోయానని తనపై ఓ వర్గం మీడియా అవాస్తవాలు రాసిందని ఆయన మండిపడ్డారు. తాను ఇక్కడే ఉన్నానని.. ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. తప్పుడు వార్తలు రాసే వారిపై న్యాయపరంగా గా ముందుకు వెళతామని కిలారు రాజేష్ హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details