ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP Leader Challa Ramachandra Reddy Surrendered: పోలీసుల ఎదుట లొంగిపోయిన చల్లా రామచంద్రారెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 3:27 PM IST

TDP Leader Challa Ramachandra Reddy Surrendered

TDP Leader Challa Ramachandra Reddy Surrendered: పుంగనూరు తెలుగుదేశం నియోజకవర్గ ఇన్​చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత నెల 4న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా పుంగనూరు పట్టణ శివార్లలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో చల్లా బాబుతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. చల్లా బాబుపై వివిధ సెక్షన్ల కింద 7 కేసులు నమోదు చేశారు. కేసుల నమోదుపై కోర్టును ఆశ్రయించిన చల్లా బాబు.. మూడు కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్‍(Anticipatory Bail)  పొందారు. 

ఇదే ఘటనకు సంబందించి  మరో కేసులో బెయిల్‍ రాకపోవడంతో... చల్లా బాబు ఇవాళ పుంగనూరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. చల్లా బాబుతో పాటు కేసులు ఎదుర్కొంటున్న మరో 100 మంది టీడీపీ కార్యకర్తలు పోలీస్​స్టేషన్​కు చేరుకున్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన చల్లా బాబుకు మద్దతుగా టీడీపీ(TDP) పోలిట్‍ బ్యూరో సభ్యులు సొమిరెడ్డి చంద్రమోహన్‍ రెడ్డి, శ్రీనివాస రెడ్డితో పాటు టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహ యాదవ్‍ స్టేషన్​కు వచ్చి సంఘీభావం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details