ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొడాలి నానికి పిచ్చి ముదిరింది - 5 రేబిస్ ఇంజెక్షన్లు పంపిస్తున్నా : బుద్ధా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2024, 2:09 PM IST

TDP_Leader_Buddha_Venkanna_Satires_on_Kodali_Nani

TDP Leader Buddha Venkanna Satires on Kodali Nani : మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడానిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. కొడాని నానిని పిచ్చికుక్కగా అభివర్ణించారు. గుడివాడ పిచ్చికుక్క బెడద వదిలించుకోవడానికి 5 రేబిస్ ఇంజెక్షన్ (Rabies Injection) దానం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రానికి గుడివాడ పిచ్చికుక్క బెడద ఎక్కువైందన్న ఆయన, పిచ్చి ముదిరిన కుక్కకి ఇంజెక్షన్​లు కూడా సీఎం జగన్ మోహన్​ రెడ్డి (CM Jagan Mohan Reddy) చికిత్స చేయించకపోవడం సరికాదని ఎద్దేవా చేశారు. అందుకే ప్రజల భద్రత కోసమే తన సొంత డబ్బుతో 5 ఇంజక్షన్ల సెట్​ని కొడాలి నానికి కొరియర్ ద్వారా పార్సిల్ పంపుతున్నానని తెలిపారు.

Vijayawada Kanaka Durga Flyover :బెజవాడలో దుర్గగుడి ఫ్లై ఓవర్ తామే తెచ్చామని ఎవరెవరో చెప్పుకుంటున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. దుర్గగుడి పై వంతెన నిర్మాణం కోసం ఉద్యమానికి తాను శ్రీకారం చుడితే, దిల్లీ వెళ్లి కేంద్రాన్ని ఒప్పించింది చంద్రబాబు అని గుర్తు చేశారు. విజయవాడకు కనకదుర్గ ఫ్లై ఓవర్ తెచ్చింది చంద్రబాబు అనటంలో రెండో మాట లేదని  ఆయన స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details