ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Viral Video: కారు ఢీకొని ఎగిరిపడ్డ వ్యక్తి.. బేకరీలోకి దూసుకెళ్లిన ట్యాంకర్.. వీడియో వైరల్

By

Published : Jun 22, 2023, 5:27 PM IST

బేకరీలోకి దూసుకెళ్లిన ట్యాంకర్

Viral Videos in Social Media : మెరుపు వేగంతో వస్తున్న కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. కారు వేగానికి అతను కొన్ని మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాడు. మరో ఘటనలో వాహనాన్ని ఓవర్​ టేక్ చేస్తూ ట్యాంకర్ బేకరీలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన వారు.. ఆదమరిస్తే అంతే సంగతులని అనుకుంటున్నారు.

ఢీకొట్టిన కారు :ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం కొద్ది పాటి వర్షం కురుస్తున్న సమయంలో హనుమాన్ జంక్షన్ కుంట నుంచి మార్కాపురం వైపు వేగంగా వస్తున్న కారు.. రోడ్డు దాటుతున్న గోళ్ల రామయ్యను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన 10 అడుగులు పైకి ఎగిరి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. సీసీ పుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బేకరీలోకి దూసుకెళ్లిన ట్యాంకర్ : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పట్టణ పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డులో ఓ బేకరీలోకి ట్యాంకర్ దూసుకెళ్లింది. జమ్మలమడుగు శివారులో గురువారం ఉదయం బేకరీ వద్ద కొంతమంది కారు పక్కన పెట్టి కొనుగోలు చేస్తున్నారు. హఠాత్తుగా బేకరీలోకి లారీ దూసుకెళ్లి పక్కనే ఉన్న కారును ఢీకొనడంతో కారు వెనుక భాగం నుజ్జు నుజ్జు అయింది. కారుతో పాటు ద్విచక్ర వాహనం దెబ్బతింది. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రొద్దుటూరు నుంచి జమ్మలమడుగు వైపు రోడ్డుపైన మూడు ట్యాంకర్లు ఒకేసారి ఓవర్​ టేక్​ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details