ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Special Song on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై ప్రత్యేక గీతం.. భావోద్వేగానికి గురైన పలువురు టీడీపీ నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 12:51 PM IST

Special_Song_on_Chandrababu_Arrest

Special Song on Chandrababu Arrest: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రజాక్షేత్రంలో మద్దతు వస్తూ ఉంటే.. మరోవైపు చంద్రబాబు నిర్దోషి అంటూ న్యాయస్థానంలో ఆయన తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్టుపై తెలుగుదేశం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ప్రత్యేక గీతాన్ని ప్రదర్శించారు. గీతాన్ని వీక్షిస్తూ పలువురు నేతలు భావోద్వేగానికి గురయ్యారు. 

గద్దె అనురాధ ఈ పాటను రూపొందించారు. 'ఆలోచించు ఆంధ్రుడా' పేరిట పాట రూపకల్పన చేశారు. 'తండ్రిలా తపన పడినందుకు చివరికిలా తెలుగు నేల రుణం తీర్చుకుందా' అనే పల్లవితో పాట సాగింది. పలువురు కళాకారులు 'చంద్రబాబుకు మద్దతుగా ఇది అందరూ కదలాల్సిన సమయం' అంటూ పిలుపునిస్తూ పాటలు రాస్తున్నారు. వాటిల్లో ఒకటైన 'తెలుగుజాతి వెలుగుబిడ్డ లేరా..' అనే ఓ పాటను నారా లోకేశ్‌ ఇటీవల తన యూట్యూబ్‌ ఛానల్‌లో పంచుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details