ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సింహాచలంలో కార్తిక పూజలు - లక్ష్మీనృసింహ స్వామి భక్తులకు మాలలు, వస్త్రాలు ఉచితం!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 1:03 PM IST

simhachalam_temple_special_poojalu_2023

Simhachalam Temple Special Poojalu 2023 : విశాఖజిల్లా సింహాచలం వరాహలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ఈవో సింగాల శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈనెల 23న కార్తిక ఏకాదశి, ఉద్దాన ఏకాదశి సహా ఐదురోజులు తిరుమంగైళ్వార్ పూజలు జరుగుతాయన్నారు. 24న మధ్యాహ్నం చిలుకు ద్వాదశి, 26న జ్వాలా తోరణం, 27న కార్తిక పౌర్ణమి వృశ్చిక దీపారాధనతోపాటు ప్రత్యేక ఆర్జిత సేవలు నిర్వహిస్తామన్నారు.

Visakha District Simhadri Temle :ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి నరసింహ మండల దీక్షలు, డిసెంబరు 4 నుంచి ద్వాత్రింశతి నరసింహదీక్షలకు శ్రీకారం చుట్టి, జనవరి 6న దీక్షల విరమణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు దేవస్థానం తరఫున తులసి మాలలు, స్వామి ప్రతిమలు, దాతల సహకారంతో దీక్షావస్త్రాలు అందించేందుకు యోచిస్తున్నామన్నారు. లోకకల్యాణార్థం ఈనెల 27 నుంచి నరసింహ మంత్ర జపం, 29న త్రిపురాంతకస్వామి ఆలయంలో వరుణాభిషేకాలు, 27న వరాహ పుష్కరిణిలో 'గంగా హారతి' ఇస్తామన్నారు. 

ABOUT THE AUTHOR

...view details