ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Viveka murder case అవినాష్ అరెస్టు తప్పదా.. న్యాయవాదులు ఏమంటున్నారంటే..!

By

Published : Apr 24, 2023, 7:57 PM IST

viveka murder case

Ys Viveka murder case cbi investigation : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వటం సమంజసం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ అడిగే ప్రశ్నలను ప్రింట్ చేసి అవినాష్ రెడ్డికి కాపీ ఇవ్వాలనటం అసమంజసం అని పేర్కొంది. ఇలాంటి ఉత్తర్వులు సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని తెలిపింది.   అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ ను త్రోసిపుచ్చింది. ముందస్తు బెయిల్ ప్రధాన పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టుకే వదిలేసింది. దీనిపై సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే.. 

సుప్రీంకోర్టు ఆదేశాలతో వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని... సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. సీబీఐ విచారణ బలహీనంగా ఉందని సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పిందన్నారు. తెలంగాణ హైకోర్టులోనూ అవినాష్ కు ఎదురుదెబ్బ తగలక తప్పదంటున్న సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌తో మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details