ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Seediri Appalaraju Dance with Tribals: ఆదివాసీ దినోత్సవం.. మహిళలతో కలిసి డ్యాన్స్​ వేసిన మంత్రి సీదిరి అప్పలరాజు

By

Published : Aug 9, 2023, 8:39 PM IST

Seediri Appalaraju Dance with Tribals

Seediri Appalaraju Dance with Tribals in Mandasa: బుధవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్రంలో పలుచోట్ల గిరిజనులు వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొని వారిని ఉత్సాహ పరిచారు. అదే సమయంలో వారితో పాటు వారి ఆచారాలను, అటవాట్లను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ ప్రజల కోరిక మేరకు వైఎస్సార్సీపీ నేత వారితో పాటు కాలు కదిపారు. ఆయన చేసిన డ్యాన్స్ వీడియోను మీరూ చూసేయండి బాసూ..

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు గిరిజనులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. శ్రీకాకుళం జిల్లా మందసలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీదిరి అప్పల రాజు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఆదివాసి మహిళల పిలుపు మేరకు వారితో కలిసి డ్యాన్స్ వేసి అలరించారు. అక్కడే ఉన్న రాజకీయ నాయకులు కూడా కాలు కదిపారు. ఒక్కసారిగా పండగ వాతావరణం నెలకొంది. ఆదివాసీ ప్రజలతో అప్పలరాజు మమేకమై వారితో ఆడి ఉత్సాహ పరిచారు. గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో గిరిజనులు వారి సమస్యలు తీర్చమని నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details