ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ సింహాచలం బీఆర్‌టీఎస్‌ రోడ్డు విస్తరణ - పనులను అడ్డుకున్న నాయకుల్ని అరెస్టు చేసిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 7:45 PM IST

road-_widening_problems_in_visakha_district

Road  Widening Problems In Visakha District : విశాఖ సింహాచలంలో  బీఆర్‌టీఎస్‌ రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్న నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. సింహాచలంలోని అడవివరం నుంచి గోసాల వరకు బీఆర్‌టీఎస్‌ రోడ్డు విస్తరణ పనులు చేపట్టగా స్థానిక ప్రజలు తమ ఇళ్లు కూల్చవద్దని ఆందోళన చేశారు. ప్రభుత్వం నుంచి రావలసిన టీడీఆర్​ బకాయిలు వచ్చిన తర్వాతే ఇళ్లను తొలగించాలని కోరారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా హడావిడిగా ఇళ్లు తొలగించడం న్యాయం కాదని వాపోయారు. ఇంకొంతమంది ప్రజలు టీడీఆర్​లు ఇస్తే మేము ఏం చేసుకుంటామని స్థలానికి బదులు ఎక్కడైనా స్థలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Road  Widening Problems in Andhrapradesh : కనీసం నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఇళ్లు కూల్చివేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అవంతి శ్రీనివాస్ ఈ రోజు ఈ కార్యక్రమానికి పురిగొల్పి అతను హైదరాబాద్​కు వెళ్లారని పలువురు ఆరోపణలు చేశారు. ​రోడ్డు అభివృద్ధికి మేము మద్దతు ఇస్తాము కానీ పరిహారాలు ఇవ్వకపోవడం, పునర్నిర్మాణ ఆదేశాలు జారీ చెయ్యకుండా ఇళ్లు కూల్చవేయద్దని ప్రజలు అంటున్నారు.మాకు ఇస్తామన్నవి మాకు ఇవ్వాలని బాధితులు డిమాండ్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details