ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పల్నాడు జిల్లాలో కారు బీభత్సం - రెండు బైకులను ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 3:27 PM IST

road_accident

Road accident in Palnadu District : పల్నాడు జిల్లా చిలకలూరిపేట కొత్త మార్కెట్​ యార్ట్​ ఎదురుగా బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మార్కెట్​ యార్డులో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వేర్వేరుగా బైక్​లపై వెళ్తుండగా కారు వేగంగా ఢీ కొట్టింది. కారు గుంటూరు వైపు నుంచి ఒంగోలు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

Two Persons Died in The Accident : ఈ ప్రమాదంలో నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన కంభంపాటి కోటేశ్వరరావు (55) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి పట్టణంలోని సెల్​ఫోన్​ దుకాణ యజమాని కిషోర్​ (48) చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెెందాడు. ఒకే ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం వల్ల మెయిన్​ బజార్​లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details