ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రైవేట్‌ కళాశాల బస్సు బోల్తా - 20 మంది విద్యార్థులకు గాయాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 9:26 PM IST

private_college_bus_overturned

Private College Bus Overturned and some Students are Injured: ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు బోల్తా పడటంతో పలువురు విద్యార్థులకు గాయాలైన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గ్రామీణ మండల పరిధిలోని చోదిమెళ్ల గ్రామం వద్ద ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. కళాశాల నుంచి విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తున్న సమయంలో అదుపు తప్పి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రైవేట్​ కళాశాలకు చెందిన పలువురు ఇంటర్ విద్యార్థులకు గాయాలయ్యాయి. 

ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తుండగా.. వారిలో సుమారు 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థులను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్యంత వేగంగా వెళ్లడమే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఏలూరు గ్రామీణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details