ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidhwani: సీఎం సభలకే మొహం చాటేస్తున్న జనం.. పార్టీ ప్రచారానికి దిక్కెవరు..?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 9:23 PM IST

Prathidhwani

Prathidhwani: ఏ ముఖం పెట్టుకుని జనంలోకి వెళతారు? సాక్షాత్ ముఖ్యమంత్రి సభల నుంచే జనం ఎందుకు వెళ్లిపోతున్నారు? ఆయన సభలంటేనే అధికారులు హడలి పోతుండడానికి కారణం ఏమిటి? ఇప్పుడు రాష్ట్రంలో అధికార వైసీపీని వేధిస్తోన్న ప్రశ్నలివి. పైగా... గతంలో గడగడపకు అన్నప్పుడే జగన్‌ సర్కారుపై వెల్లువెత్తిన ప్రజావ్యతిరేకత అంతా కళ్లకు కట్టింది. ఇప్పుడేమో సామాజిక న్యాయ యాత్రలు అంటున్నారు వారి అధినేత జగన్. సామాజిక న్యాయయాత్ర వంటి కార్యక్రమాలంటే ప్రభుత్వం తరపున అన్నివర్గాలకు ఏం చేశారో చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏం ప్రయోజనం చేకూర్చారో వివరించాలి. జగన్ సర్కారుకు ఆ ధైర్యం నిజంగా ఉందా?  ఈ పరిస్థితుల్లో ప్రజల నుంచి వారికెలాంటి ప్రశ్నలు ఎదురు కావచ్చు?  ఇటీవలే సీఎం జగన్ 8800 మంది పార్టీ నేతలతో భారీ సమావేశం పెట్టి ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. హామీల నుంచి ప్రజల ప్రస్తుత కష్టాల వరకు వారి వద్ద సమాధానాలు ఉన్నాయా? సీఎం సభలకే జనం మొహం చాటేస్తే... ఇక పార్టీ ప్రచారానికి దిక్కెవరు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details