ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidhwani: టీడీపీ ఎలక్ట్రోరల్ బాండ్స్‌ విరాళాలు అవినీతేనా? ఆ బాండ్స్ నిధుల్లో అగ్రస్థానంలో ఉన్న వైసీపీ సంగతేంటీ ?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 9:10 PM IST

Prathidhwani

Prathidhwani: స్కిల్ కేసులో చంద్రబాబును జైల్లో పెట్టి నెలరోజులు కావస్తుంది.. సీఐడీ నేటికీ బలమైన ఆధారాలు చూపించలేకపోతుంది. పైగా చంద్రబాబుకు బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని పనలేని వాదనలు వినిపిస్తుంది. సీఎంగా ఉన్న జగన్ అనేక కేసుల్లో బెయిల్ మీద లేరా? ప్రభావితం చేయగలిగేది అధికారంలో ఉన్నవారా? ప్రతిపక్షంలో ఉన్నవారా? మరో పక్క రూ.27 కోట్లు టీడీపీకి విరాళంగా వచ్చాయని ప్రభుత్వం ఆరోపిస్తుంది. టీడీపీ వచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్స్‌ విరాళాలు అన్నీ అవినీతేనా? అలా అయితే,  ఎలక్ట్రోరల్ బాండ్స్ ద్వారా నిధుల్లో అగ్రస్థానంలో వైసీపీ ఉంది.  ఈ స్కిల్ కేసులో చంద్రబాబు పేరు  ఏ-37గా చేర్చారు. చంద్రబాబుకు నిధులు చేరినట్టు చిన్న ఆధారమైనా చూపారా? స్కిల్ కేసులో రూ.317 కోట్లకు సరిపడా అత్యంత ఖరీదైన సామగ్రీ కనిపిస్తుంది. అసలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను దర్యాప్తు అధికారులు చూశారా? ఏ ప్రభుత్వంలోనైనా తప్పు జరిగితే ఆ శాఖ చూసే అధికారులు బాధ్యులు కారా? అలాంటిది.. స్కిల్ శాఖలో తప్పు జరిగితే అధికారులను ఎందుకు తప్పించారు? బాధ్యులను తప్పించి బాబు చుట్టే కేసు ఎందుకు అల్లారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details