ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Prathidwani: కరెంట్ కోతల రాష్ట్రం.. కట్టుకథల ప్రభుత్వం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 10:00 PM IST

ప్రతిధ్వని

Prathidwani: కరెంట్‌ కష్టాలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే మంట పుట్టిస్తున్న విద్యుత్ ఛార్జీల బాదుడుకు తోడు... వేళాపాళా లేని కోతలు.. పవర్ హాలిడేలు ప్రజల్లో ఆవేదన, ఆక్రోశాలకు కారణం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి విపక్షాలు చేపడుతున్న ఆందోళనలు.. సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. అసలు.. ఎక్కడ ఉండే రాష్ట్రం పరిస్థితి ఎక్కడకు వచ్చింది? చాలినంత మిగులు విద్యుత్‌, ఇంధన నిర్వహణలో దేశంలోనే నంబర్‌ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌.. ఇప్పుడు కనీసం ఆస్పత్రులకు కావాల్సిన కనీస విద్యుత్‌ను ఎందుకు అందించలేక పోతోంది? ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని కరెంట్‌తో రైతులు, సామాన్యప్రజలు ఇన్ని ఇక్కట్లు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోంది..? నేరుగా ఛార్జీల పెంపు ద్వారా అయితేనేమీ... శ్లాబుల్లో మార్పుల ద్వారా అయితేనేమీ... సగటు గృహ వినియోగదారులు, పరిశ్రమలపై వైసీపీ  ప్రభుత్వం నాలుగేళ్లలో మోపిన విద్యుత్ భారం... పెంచిన ఛార్జీల డబ్బంతా ఏం చేస్తున్నారు? కరెంట్ ఎందుకు కొనలేక పోతున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.  

ABOUT THE AUTHOR

...view details