ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police Stopped Chandranna Dasara Kanuka Program: "చంద్రన్న దసరా కానుక"ను అడ్డుకున్న పోలీసులు.. టీడీపీ నేత మన్నవ మోహన్ కృష్ణ ఆగ్రహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 1:23 PM IST

Police_stopped_Chandranna_Dasara_Kanuka_Program

Police Stopped Chandranna Dasara Kanuka Program :నిరుపేదలకు చంద్రన్న దసరా కానుకగా (Chandranna Dasara Kanuka) సరకులు పంపిణీ చేయకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమని టీడీపీ నేత మన్నవ మోహన్ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని గుంటూరులోని గుజ్జనగుండ్ల సెంటర్​లో నిత్యావసర సరుకుల పంపిణీకి ఏర్పాట్లు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిర్వాహకులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. సంక్రాంతి, ఉగాది, రంజాన్, కిస్మస్ లాంటి పర్వదినాల వేళ తెలుగుదేశం పార్టీ తరఫున నిరుపేద ప్రజలకు సరకులు పంపిణీ చేస్తున్నామని మన్నవ మోహన కృష్ణ తెలిపారు. 

TDP Leader Mannava Mohan Krishna Fire on Police Behavior :తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన కానుకల్ని నిలిపివేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. టీడీపీ ఇస్తున్న పంపిణీ సైతం అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. 5 వేలు, 10 వేల మందికి పంపిణీ చేస్తున్నారంటూ, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులు కార్యక్రమాన్ని నిలిపివేయడంపై ఆయన ధ్వజమెత్తారు. ముందస్తు అనుమతి తీసుకున్నా.. కావాలనే ఉన్నతాధికారులు కార్యక్రమాన్ని అడ్డుకున్నారని మన్నవ మోహన కృష్ణ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details