ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police Registered Cases Against TDP Activists: చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌పై నిరసనలు.. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2023, 4:02 PM IST

Police_Registered_Cases_Against_TDP_Workers

Police Registered Cases Against TDP Activists: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్, రిమాండ్‌ను నిరసిస్తూ.. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గత రెండు రోజులుగా అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిరసన కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడమే కాకుండా, వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి స్టేషన్లకు తరలిస్తున్నారు. 

Police Registered Cases Against 76 TDP Activists: తాజాగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండు రోజులుగా ఆందోళనలు నిర్వహించిన టీడీపీ పార్టీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొదటి రోజు చేసిన నిరసనలకు గాను.. శాంతిపురం మండలంలో 76 మందిపై, రామకుప్పంలో 15 మందిపై, కుప్పం మండలంలో 47 మంది నాయకులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా, రెండోరోజు ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో పాటు మరో 26 మంది నేతలు.. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారని డిపో మేనేజర్ ఫిర్యాదు చేయగా.. తెల్లవారుజామున పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

Pujas for Chandrababu Release from Jail:మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ.. చిత్తూరు జిల్లా కుప్పంలోని గంగమ్మ ఆలయంలో ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ముఖ్యమంత్రి జగన్‌, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడ్ని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details