ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత టీడీపీ శ్రేణులను చితకబాదిన పోలీసులు

By

Published : Jan 4, 2023, 9:52 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

చంద్రబాబు కుప్పం పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పర్యటనలో పాల్గొనడానికి బయల్దేరిన టీడీపీ కార్యకర్తలు, శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. శాంతిపురం మండలంలో నిర్వహించనున్న పర్యటనలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. ఎస్.​ గొల్లపల్లి నుంచి టీడీపీ శ్రేణులు బయలుదేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జ్​ చేశారు. మహిళా కార్యకర్తలు, టీడీపీ శ్రేణులను విచక్షణరహితంగా చితకబదారు. కార్యకర్తలు, శ్రేణులకు గాయాలయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details