ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పిఠాపురం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల ఆందోళన - పలు రైళ్లు ఆలస్యం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 10:09 PM IST

Concern_of_Passengers_at_Pithapuram_Railway_Station

Passengers Protest at Pithapuram Railway Station : కాకినాడ జిల్లా పిఠాపురం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. షాలిమర్ నుంచి త్రివేండ్రం వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు రిజర్వేషన్ బోగీలలో వెయిటింగ్ లిస్ట్ టికెట్​తో ప్రయాణిస్తున్న కొంత మంది ప్రయాణికులను అధికారులు దింపివేశారు. దీంతో పలువురు ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అలాగే రైలు పట్టాలపైకి వెళ్లి నిరసన చేపట్టారు. అంతలోనే పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను అదుపుచేసి అక్కడి నుంచి రైలును పంపించారు. ఈ క్రమంలో పోలీసులకు, ప్రయాణికులకు మధ్య వాగ్వాదం జరిగింది.  

దీంతో సుమారు 150మందికి పైగా ప్రయాణికులు పిఠాపురం రైల్వేస్టేషన్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కూర్చోడానికి సీట్లు లేకున్నా తాము నిలబడే వచ్చామని ప్రయాణికులు తెలిపారు. అకస్మాత్తుగా దింపేయటంతో మహిళలు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడ్డారు. ఆందోళనకారులు రైలును నిలిపి వేయడం వల్ల విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీంతో మిగతా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

ABOUT THE AUTHOR

...view details