ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పంచమి తీర్థానికి సిద్ధమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2023, 7:02 PM IST

padmavathi_ammavari_karthika_brahmothsavalu

Padmavathi Ammavari Karthika Brahmothsavalu :తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు నిర్వహించే పంచమి తీర్థానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుచానూరులో పంచమితీర్ధం ఏర్పాట్లును, అలిపిరిలోని సప్త గోప్రద‌క్షిణ‌ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. 

Thiruchanuru Special Poojalu : తిరుపతి నుంచి తిరుచానూరుకు వచ్చే మార్గంలో దాదాపు 25 వేల మంది వేచి ఉండేలా సౌకర్యాలు ఏర్పాట్లు చేశామన్నారు. షెడ్లలో వేచి ఉన్న భక్తులను పుష్కరిణిలోకి చక్రస్నానానికి గంట ముందుగా అనుమతిస్తామన్నారు. ఈ నెల 23న సప్త గోప్రద‌క్షిణ‌ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నవంబర్​ 23న ప్రారంభయ్యే ఈ హోమం ఉదయం 9 గంటలకు ముహూర్తం.. రెండు గంటలపాటు జరిగే ఈ హోమంలో 100 జంటలు పాల్గొనే అవకాశం ఉంటుందని టీటీడీ ఈవో తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఆహార సదుపాయాలు కూడా కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details