ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబుకు అరెస్టుతో మద్దతు పెరిగింది - అండగా నిలబడినవారందరికి కృతజ్ఞతలు : భువనేశ్వరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 1, 2024, 7:55 PM IST

ntr_trust_md_nara_bhuvaneshwari

NTR Trust MD Nara Bhuvaneshwari: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించిందని ఎన్టీఆర్ ట్రస్ట్‌ ఎండీ నారా భువనేశ్వరి అన్నారు. నూతన సంవత్సరాన్ని పురష్కరించుకుని ఆమె డిజిటల్​ క్యాలెండర్​ను విడుదల చేశారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించగా, ఆ వేడుకల్లో భువనేశ్వరి క్యాలెండర్​ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్​ కట్​ చేసి అక్కడున్న సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా ఆమె తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 53రోజులు పాటు చంద్రబాబు గారి కోసం నిలబడిన‌ తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

కేసులకు భయపడకుండా ప్రజలు బయటకు వచ్చి చంద్రబాబుకు అండగా నిలబడ్డారని, ఈ క్రమంలో వారందరికీ భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మహిళలు తన మనస్సులో ఎప్పటకీ ఉండిపోతారన్నారు. కొత్త ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఒక్కరు తమ లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. 

ABOUT THE AUTHOR

...view details