ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబును సీఎం చేయటమే లక్ష్యం.. యువగళం పాదయాత్రలో 'ఎన్​ఆర్ఐ బాబాయి'

By

Published : Apr 13, 2023, 3:10 PM IST

యువగళం పాదయాత్రలో లోకేశ్​కు తోడుగా ఎన్​ఆర్​ఐ

NRI CAME FOR YUVAGALAM PADHAYATHRA: అమెరికాలో 30 ఏళ్ల క్రితం స్థిరపడిన ఓ వ్యక్తి యువగళం పాదయాత్రలో పాల్గొన్నాడు. అంతేకాక అతడు పార్టీ కార్యకర్తలా పాదయాత్రలో  చురుకుగా పాల్గొనడం పని చేస్తుండటం అందర్నీ ఆకట్టుకుంటుంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంటూ ఆ దేశ పౌరసత్వం పొందిన రంగారావు.. ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవుపై వచ్చి లోకేశ్ యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే అమరావతి రాజధానిగా కొనసాగుతుందని చెప్పిన ఆయన.. బాబును సీఎం చేయటమే లక్ష్యమని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఎన్​ఆర్​ఐ రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వందలాది ఎన్​ఆర్​ఐలు ఈ పాదయాత్రలో పాల్గొంటారని రంగారావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు వ్యాఖ్యానించిన ఆయన.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నుంచి లోకేశ్​తో పాటు అన్ని జిల్లాలను చుట్టేస్తూ ఆయన.. 'ఎన్​ఆర్ఐ బాబాయి'గా యువగళం పాదయాత్ర మొత్తం బృందానికి ఆత్మీయుడయ్యారు.  

ABOUT THE AUTHOR

...view details