ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Pension Problem: 'నా వయసు 62.. పింఛన్ ఇవ్వండయ్యా..' వృద్ధుడిని పట్టించుకోని అధికారులు

By

Published : Jun 1, 2023, 6:02 PM IST

YSR Pension Kanuka

Oldman Pension Problem: కృష్ణాజిల్లా మొవ్వ మండల కేంద్రంలో  పింఛన్ కోసం మహా లింగదేవరా అనే ఓ వృద్దుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెబుతున్నా.. అరకొర సౌకర్యాలు గానే మిగులుతున్నాయి. 62 సంవత్సరాలు వచ్చిన కూడా పెన్షన్ ఇవ్వటం లేదని లింగదేవరా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వాలంటీర్లకు ఎన్నిసార్లు తన గోడు వినిపించుకున్నా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నాడు. తన రేషన్ కార్డు, ఆధార్ కార్డుల్లో సైతం 62 సంవత్సరాల వయస్సు ఉందని వెల్లడించాడు. 

పెన్షన్ తీసుకునేందుకు అర్హుడై ఉండి కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు మహా లింగదేవరా పేర్కొన్నాడు. కుల ధ్రువీకరణ పత్రం లేదనే కారణంతో  పెన్షన్ ఇవ్వకుండా తిప్పిస్తున్నారని మహా లింగదేవరా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బుడగ జంగాలు వారు అనే సాకు చూపుతూ... తన అభ్యర్థనను తిరస్కరిస్తున్నారని వాపోయాడు.  తనతోపాటు కొందరికి కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ.. అది చూపించినా  పింఛన్ ఇవ్వడం లేదని  పేర్కొన్నాడు. ప్రభుత్వ  కార్యాలయంలో తనను ఎవరూ పట్టించుకోవట్లేదని, తన సమస్యలను  వాలంటీర్లకు చెప్పుకున్నా.. వారు కూడా తన సమస్యపై స్పందించడం లేదని వెల్లడించాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. రెండు సంవత్సరాలనుంచి పెన్షన్​కు అర్హుడైనా తనకు పిఛన్ రాకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు  వెల్లడించారు.  

ABOUT THE AUTHOR

...view details