ఆంధ్రప్రదేశ్

andhra pradesh

No Permissions for Chalo Vijayawada Program: చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు లేవు : డీసీపీ విశాల్‌ గున్ని

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2023, 9:24 AM IST

No_Permissions_for_Chalo_Vijayawada_Program

No Permissions for Chalo Vijayawada Program : విజయవాడలో ఈ నెల 15న ఆగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ప్రభుత్వం, ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నుంచి అనుమతులు లేవని డీసీపీ విశాల్ గున్ని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వబడదని పేర్కొన్నారు. ప్రజల నిత్య జీవనానికి భంగం కలిగించకూదని అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసారు. పోలీసుల ఆదేశాలను కాదని ఎవరైనా వస్తే సెక్షన్లు 143, 290, 198 కింద పలు కేసులు పెడతామని హెచ్చరించారు. 4000 మందిని తనిఖీలకి, బందోబస్తుకు ఏర్పాటు చేసామని తెలిపారు. 

DCP Vishal Gunni Said Take Permission for Ganesh Temples :విజయవాడలోకి వచ్చే ప్రతీ వాహనం తనిఖీ చేయబడుతుందన్నారు.  బయటి వాళ్లు ఆ 500 మందిలో కలిసే అవకాశం ఉందని అనుమతి నిరాకరిస్తున్నారు. గణపతి మండపాల ఏర్పాటుకు కమాండ్ కంట్రోల్​లో ఏర్పాటు చేసిన సింగిల్ విండోలో అనుమతి తీసుకోవాలని కోరారు. ఒకే చోట అనుమతులకు ఏర్పాటు చేశామని.. అన్ని డిపార్ట్మెంట్​ల నుంచీ అధికారులు ఇక్కడే అందుబాటులో ఉంటారన్నారు. నిమజ్జనం సెక్యూరిటీ, నిమజ్జనం ప్రదేశాలు, వీఎంసీ చేసే ఏర్పాట్లు తెలిజేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సామాజిక భద్రతకు విఘాతం కలిగించే వారు వచ్చే అవకాశం ఉందని తెలిస్తే అనుమతులు ఇవ్వమని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details