ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nimmakuru people met with Nara Bhuvaneswari: 'రాజమహేంద్రవరం తరలివచ్చిన నిమ్మకూరు'.. ఆడపడుచు భువనమ్మకు సంఘీభావం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2023, 7:47 PM IST

Nimmakuru people met with Nara Bhuvaneswari

Nimmakuru people met with Nara Bhuvaneswari: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్ట్​కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అరెస్ట్ అక్రమం అంటూ... తెలుగుదేశం నేతలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఆయన అభిమానులు.. రాజమహేంద్రవరంలో ఉన్న నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలుపుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

కృష్ణా జిల్లా నిమ్మకూరు వాసులు రాజమహేంద్రవరంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)ని కలిసి సంఘీభావం తెలిపారు. నిజాయతీపరుడైన చంద్రబాబుపై నిందలు వేయడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని అక్రమంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టారంటూ నిమ్మకూరు వాసులు ఆవేదన వెలిబుచ్చారు. చంద్రబాబు (Chandrababu) త్వరగా బయటికి రావాలని కోరుకున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచి  సీఎం కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కక్షసాధింపు చర్యలను మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజాగ్రహం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details