ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆడుకుంటూ వెళ్లిన బాలుడు అదృశ్యం - తెల్లవారేలోగా డ్రైనేజీలో తేలిన మృతదేహం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 5:40 PM IST

negligence_of_authorities_child_died_in_drainage

negligence of authorities child died in drainage: విజయవాడ 56వ డివిజన్ పరిధిలో పాత రాజరాజేశ్వరి పేటలో విషాదం జరిగింది. అష్రాఫ్ అనే ఐదేళ్ల బాలుడు బుధవారం సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి మృతి చెందాడు. బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేసుకుని..  బాలుడి ఆచూకీ కోసం రాత్రి 2గంటల వరకు గాలించామని టూ టౌన్ పోలీసులు తెలిపారు. 

సాయంత్రం అదృశ్యమైన అష్రాఫ్... ఆడుకుంటూ ఇంటి పక్కనే ఉన్న డ్రైనేజ్‌లో పడి మృతి చెందినట్లు పోలీసులు ఉదయం గుర్తించారు. విజయవాడ నగరపాలక సంస్థ(VIJAYAWADA MUNCIPAL CORPORATION) అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని స్థానికులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం పసివాడి ప్రాణాన్ని బలి తీసుకుందని పేర్కొన్నారు. బాలుడి మృతదేహన్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. డ్రైనేజీలపై మూతలు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details