ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యువగళాన్ని నవశకం వైపు నడిపిన అందరికీ కృత‌జ్ఞత‌లు - ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటా : నారా లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 7:34 PM IST

Nara_Lokesh_Thanks_to_All

Nara Lokesh Thanks to All: తన యువ‌గ‌ళం పాదయాత్రను న‌వ‌శ‌కం వైపు న‌డిపించిన అందరికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్ హృద‌య‌పూర్వక కృత‌జ్ఞత‌లు తెలియజేశారు. వైసీపీ దుర్మార్గ పాల‌న‌పై ప్రజ‌ల్ని చైత‌న్యం చేసే ల‌క్ష్యంతో కుప్పంలో జ‌న‌వ‌రి 27న ప్రారంభించి డిసెంబ‌ర్ 18న విశాఖ‌లో ముగిసే నాటికి మొత్తం 226 రోజులు పాటు ప్రజలందరూ వెంట ఉండి తనను న‌డిపించారన్నారు. పాద‌యాత్రలో తాను చూసిన క‌ష్టాలు, గ్రామాల స‌మ‌స్యలు ప్రజ‌ల ముందుంచ‌డంలో ప్రముఖ పాత్ర వ‌హించిన మీడియాకు ధ‌న్యవాదాలు తెలిపారు. తన‌ను కంటికి రెప్పలా క‌నిపెట్టుకుని పాద‌యాత్రలో సంయ‌మ‌నంతో విధులు నిర్వర్తించిన యువ‌గ‌ళం బృందం, వాలంటీర్లకి అభినందనలు చెప్పారు. 

తన‌ను అడ్డుకోవాల‌ని ప్రభుత్వం విప‌రీత‌మైన ఒత్తిడి చేసినా లొంగ‌కుండా యువ‌గ‌ళంలో బందోబ‌స్తు బాధ్యత‌లు నిర్వర్తించిన‌ పోలీసుల‌కు న‌మ‌స్సులు తెలిపారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర ఇంత విజ‌య‌వంతం కావ‌డానికి కృషి చేసిన తెలుగుదేశం నేత‌లు, కార్యక‌ర్తలు, అభిమానులు సహా ఈ మ‌హాప్రయాణంలో భాగ‌మైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృత‌జ్ఞత‌లు చెప్పారు. 97 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఏ ఊరువెళ్లినా, ఏ ప‌ట్టణంలో న‌డిచినా ప్రజ‌లు తనను త‌మ వాడిగా ఆశీర్వదించి, ఆద‌రించారని, వారందరికీ రుణ‌ప‌డి ఉంటానన్నారు. త్వర‌లో ఏర్పడ‌బోయే ప్రజాప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి-సంక్షేమానికి కృషి చేసి, ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటాన‌ని హామీ ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details