ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"మేము అడగగానే లోకేశ్​ స్పందించినందుకు సంతోషంగా ఉంది"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 10:57 PM IST

lokesh

Nara Lokesh Responded On Farmers Problems: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ను సాయం కోరిన వెంటనే, స్పందించారని గుంటూరు జిల్లా రైతులు ఆయనకు కృతజ్ఞత తెలిపారు. మిగ్​జాం తుపాను ప్రభావంతో అధికంగా కురిసిన వర్షాలకు తమ పంట పొలాల్లో నిలిచిన నీటిని తొలగించాలని, దుగ్గిరాలకు చెందిన రైతులు లోకేశ్​కు విన్నవించుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన లోకేశ్​ అక్కడికి జేసీబీని పంపించారు. దీంతో దుగ్గిరాల మండలం పెదకొండూరు-వీర్లపాలెం పరిధిలోని చిన కాల్వలో నిల్వ ఉన్న తుటి కాడను జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ తూటికాడ కాల్వలో అడ్డుగా ఉండడంతో  పొలాల్లో వర్షం నీరు నిల్వ ఉందని రైతులు వివరించారు. 

తుటి కాడ తొలగించడంతో రైతుల పంట పొలాల్లో నిల్వ ఉన్న వర్షం నీరు బయటకు వెళ్తోంది. దాదాపు 400 ఎకరాల నుంచి వర్షం నీరు బయటకు వెళ్లినట్లు రైతులు వివరించారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకపోయిందని రైతులు వాపోయారు. అడగగానే లోకేశ్​ స్పందించటంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details