ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nara Lokesh on Psycho Jaganasura: 'దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం - మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2023, 1:26 PM IST

Updated : Oct 23, 2023, 12:04 PM IST

Nara_Lokesh_on_Psycho_Jaganasura

Nara Lokesh on Psycho Jaganasura:విజ‌య‌ ద‌శ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ప్రజలు, తెలుదేశం పార్టీ శ్రేణులు సోమవారం రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మ‌ధ్య‌లో వీధుల్లోకి వ‌చ్చి ''సైకో పోవాలి'' అని రాసి, ఆ ప‌త్రాల‌ను మంటల్లో ద‌హ‌నం చేయాలని.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. 'దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం - మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం' అంటూ ఆయన నినదించారు. నాలుగేన్నరేళ్లుగా అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దామని లోకేశ్ ట్విట్ చేశారు.

Nara Lokesh Tweet:'దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం - మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం' అంటూ నారా లోకేశ్ సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు. ఆ ట్విట్‌లో.. ''అక్టోబ‌ర్ 23 విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మ‌ధ్య‌లో వీధుల్లోకి వ‌చ్చి ''సైకో పోవాలి'' అని రాసి, ఆ ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయండి. ఆ వీడియో, ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయండి. సైకో జ‌గ‌న్ అనే చెడుపై.. మంచి అనే చంద్ర‌బాబు సాధించ‌బోయే విజ‌యంగా ఈ ద‌స‌రా పండ‌గ‌ని సెల‌బ్రేట్ చేసుకుందాం'' అని ఆయన పేర్కొన్నారు.  

జ‌గ‌నాసురుడి పాల‌న అంత‌మే లక్ష్యంగా.. మంచి సాధించ‌బోయే విజ‌యానికి సంకేతం విజ‌య‌ద‌శ‌మి సంబ‌రమని.. నారా లోకేశ్​ అన్నారు. ప్రజ‌ల్ని అష్టక‌ష్టాలు పెడుతున్న జ‌గ‌నాసురుడి పాల‌న అంత‌మే లక్ష్యంగా.. అంతా కలిసి పోరాడ‌దామని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా.. ప్రజలు అంద‌రికీ ద‌సరా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లు తొలగిపోయి.. రాష్ట్రానికి మంచి జరగాలని జగన్మాతను కోరుకుంటున్నానని అన్నారు. దుర్గాదేవి మహిషాసురుడిని అంతం చేయడానికి తొమ్మిది రాత్రులు యుద్ధం చేసిందని లోకేశ్​ సతీమణి.. బ్రాహ్మణి అన్నారు. ఈరోజు రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 వరకు వీధుల్లోకి వ‌చ్చి.. 'సైకో పోవాలి' అని రాసిన ప‌త్రాల‌ను ద‌హ‌నం చేసి.. ఆ వీడియో, ఫోటోల‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేద్దామన్నారు.

Last Updated : Oct 23, 2023, 12:04 PM IST

ABOUT THE AUTHOR

...view details