ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Nara Lokesh and Brahmani on Gandhi Jayanti: అంతిమ విజయం న్యాయానిదే.. గాంధీ జయంతి సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి నివాళులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2023, 1:22 PM IST

Nara Lokesh and Brahmani on Gandhi Jayanti

Nara Lokesh and Brahmani on Gandhi Jayanti: జాతిపితగా, బాపూగా దేశ ప్రజల మదిని చూరగొన్న మహాత్ముడిని.. ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మహాత్ముని జీవితంలోని ఘటనల నుంచి స్ఫూర్తి పొందాల్సిన తరుణమిది అంటూ పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి నివాళులు అర్పించారు. జనం కోసం జన్మించిన మహాత్ముడు, దేశ స్వేచ్ఛా స్వాతంత్ర్యమే లక్ష్యంగా జీవించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని నారా లోకేశ్ నివాళులు అర్పించారు. 

సత్యం, అహింస ఆయుధాలుగా అందించిన బాపూజీ ధర్మపోరాటానికి స్పూర్తి అని తెలిపారు. గాంధీజీ సత్యాగ్రహం ప్రపంచానికి ఒక ఉత్తమ పోరాట బాటను చూపిందని లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి అన్నారు. అంతిమ విజయం న్యాయానిదే అన్న మహాత్ముని వాక్కుని తను మనసారా నమ్ముతానన్నారు. సత్యమేవ జయతే అన్నది ఒక నినాదం కాదు, ఒక ఉత్తమ జీవన మార్గమని ఆమె తెలియజేశారు. గాంధీజీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని బోధనలను స్మరించుకుందామన్నారు.

ABOUT THE AUTHOR

...view details