ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Murder Case Accused Warning Selfie Video: 'మా జోలికొస్తే పరిస్థితులు వేరేలా ఉంటాయ్..' హత్య కేసు నిందితుడి సెల్ఫీ వీడియో

By

Published : Aug 21, 2023, 5:57 PM IST

Updated : Aug 21, 2023, 7:42 PM IST

Ramakrishna_Reddy_Murder_Case_Accused_Selfie_Video

Ramakrishna Reddy Murder Case Accused Selfie Video: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ మాజీ సమన్వయకర్త(ఇంఛార్జి) చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య కేసులో నిందితుడు వరుణ్ అలియాస్ వరూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో (Selfie Video) కలకలం రేపుతోంది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న అతడు బెయిల్​పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి సోదరి మధుమతిరెడ్డికి వార్నింగ్ (Warning) ఇస్తూ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. భూ కబ్జాలు, కాంట్రాక్టర్​లను బెదిరించి డబ్బులు వసూలు చేయడం తప్ప రామకృష్ణారెడ్డి (Ramakrishna Reddy) హిందూపురానికి చేసిందేమీ లేదని అతడు వీడియోలో తెలిపాడు. దీంతోపాటు రామకృష్ణారెడ్డి చేసిన ఎన్నో అరాచకాలకు తాను కళ్లారా చూశానని,.. అలాంటివాడు చనిపోవటం వల్ల గ్రామానికి మంచే జరిగిందని అన్నాడు. మీ తమ్ముడు రామకృష్ణారెడ్డి ఎలాంటి వారో తెలుసుకోవాలని మధుమతిరెడ్డికి వీడియో సందేశం పంపించాడు. ఇప్పుడు తన జోలికి కానీ,.. తనకు సంబంధించిన వాళ్ల జోలికి కానీ వస్తే పరిస్థితులు వేరేగా ఉంటాయని వారిని హెచ్చరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారగా.. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 

Last Updated :Aug 21, 2023, 7:42 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details