ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Mother and Son Protested by Climbing Water Tank: భూసమస్య పరిష్కరించాలని వాటర్ ట్యాంక్ ఎక్కి తల్లీకొడుకుల నిరసన

By

Published : Aug 14, 2023, 11:53 AM IST

Mother_and_son_protested_by_climbing_water_tank

Mother and Son Protested by Climbing Water Tank: ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెం పంచాయతీలోని కన్నాయిగుట్ట నిర్వాసిత కాలనీకి చెందిన తల్లీకొడుకులు తమ భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ మంచినీటి ట్యాంక్ ఎక్కారు. నారాయణమ్మ, కుమారుడు వెంకటేశ్వరరావుకు ఆర్ అండ్ ఆర్​లో ఆరు ఎకరాల భూమిని స్వర్ణవారిగూడెంలో ఇచ్చారు. అందుకు సంబంధించి పట్టాల సైతం అందించారు. కాగా ఈ భూమి తమకు చెందినదని మడకం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తమను ఇబ్బందులు గురి చేస్తున్నాడని, వెంటనే అరెస్ట్ చేసి తమ భూమి తమకు అప్పగించాలని కోరుతూ తల్లీకొడుకులు మంచినీటి ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. ట్యాంక్ వద్ద మా చావుకు కారణం వెంకటేశ్వరరావు అని బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా పైకి వస్తే దూకేస్తామని బెదిరించారు. పోలీసుల రంగ ప్రవేశం చేసినా వెంకటేశ్వర్లు అరెస్ట్ చేస్తేనే కిందకు దిగుతామని చెబుతున్నారు. ప్రస్తుతం ట్యాంకు వద్ద హైడ్రామా కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details