ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆ విషయంలో దేశంలోనే చంద్రగిరి నియోజకవర్గం నంబర్ వన్ : టీడీపీ ఎమ్మెల్సీ అశోక్​బాబు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2023, 4:10 PM IST

mlc_paruchuri_ashok_comments_on_poling_booths_in_chandragiri

MLC Paruchuri Ashok Comments On Poling Booths In Chandragiri :చంద్రగిరి పరిధిలో ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల నమోదులో వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని తెలుగుదేశం నేత అశోక్‌బాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే చెవిరెడ్డికి భయపడి అధికారులు కూడా వంతపాడారని ఆరోపించారు. ఈ చర్యలను సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధ్యులపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని అశోక్​బాబు కోరారు.  

MLC Paruchiri Latest News : ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా నమోదైన దొంగ ఓట్లు, ఇష్టానుసారం పోలింగ్ బూత్​ల ఏర్పాటు, కొత్త బూత్​ల మార్పులో దేశంలోనే చంద్రగిరి నియోజకవర్గమే టాప్ అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ధ్వజమెత్తారు. స్థానిక అధికారులు కూడా టీడీపీ బీఎల్వోలు ఇచ్చివ ఫామ్-6, ఫామ్-7 ఇతర దరఖాస్తుల్ని పక్కనపెట్టి, కేవలం వైసీపీ వారి వివరాలు మాత్రమే అప్ లోడ్ చేస్తున్నారని అశోక్ బాబు మండిపడ్డారు. ఒకే వ్యక్తి ఫోటోతో వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన ఓట్లపై కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details