ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MLA Nimmala Ramanaidu Allegations Against CM Jagan: పునరావాసం పేరుతో రూ.100 కోట్ల అవినీతి: నిమ్మల రామానాయుడు

By

Published : Aug 9, 2023, 7:20 PM IST

TDP leader Nimmala

TDP leader Nimmala Ramanaidu sensational allegations against CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లను మార్చారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో జగన్ రెడ్డి మాట్లాడిన కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసిన రామానాయుడు.. పోలవరం నిర్వాసితుల పరిహారం పట్ల జగన్ మాట మార్చిన తీరుపై రెండు పేజీల లేఖను విడుదల చేశారు.

Letter on Compensation of Polavaram Residents: టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విడుదల చేసిన లేఖ ప్రకారం..''ప్రస్తుతం సైట్‌లో ఉన్న కాంట్రాక్టర్ పని తీరు సంతృప్తికరంగానే ఉంది. మార్చాల్సిన అవసరం లేదు. కానీ, 2009లో వైఎస్ కాంట్రాక్టర్‌ను మార్చడం వల్ల హెడ్‌వర్క్స్ నిలిచిపోయాయి. ఇప్పుడూ అదే పరిస్థితి తలెత్తితే ప్రమాదమని ఆగస్టు 13, 2019న పీపీఏ 10వ మీటింగ్ మినిట్స్‌లో పేర్కొంది. అయినా, జగన్ రెడ్డి కమీషన్ల కోసం రివర్స్ టెండరింగ్ డ్రామాతో రిజర్వ్ టెండరింగ్‌కి పాల్పడి కాంట్రాక్టర్‌ను మార్చారు. జగన్ రెడ్డి అసమర్ధతతో డ్యాం సైట్‌లో 15 నెలల పాటు కాంట్రాక్టర్ లేకపోవడంతో 2020 ఆగస్టు-అక్టోబర్‌లో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా, పునరావాసం పేరుతో దాదాపు రూ.100 కోట్ల అవినీతి జరిగిందని కూడా ఐఐటి తన నివేదికలో పేర్కొంది. జగన్ రెడ్డి ఆస్తులను కాపాడుకోవడానికి పక్క రాష్ట్రంతో కుమ్మక్కై బహుళార్ధక సాధక ప్రాజెక్టును ఎత్తు తగ్గించి బ్యారేజీగా మారుస్తున్నారు. నిర్వాసితులకు ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చి, తరువాత రూ. 10 లక్షలు ఇస్తానని మాట మార్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదు'' అని ఆయన వివరించారు.

ABOUT THE AUTHOR

...view details