ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హొయలొలికే నడకతో ముద్దుగుమ్మల ర్యాంప్‌ వాక్ - విశాఖలో మిస్ అండ్ మిసెస్ ఫ్యాషన్ షో

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 7:36 PM IST

ladies_fashion_show_in_visakhapatnam

Miss and Mrs Fashion Show in Visakhapatnam: విశాఖలో మిస్ అండ్ మిసెస్ ఫ్యాషన్ షో (Miss And Misses Fashion Show) ఎంతో కోలాహలంగా కొనసాగింది. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని వెంకోజిపాలెంలో క్వీన్​ ఈవెంట్స్ (Queen Events) ఆధ్వర్యంలో సీఎంఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ ఫ్యాషన్ షో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. హొయలొలికే నడకతో ముద్దుగుమ్మలు ర్యాంప్‌ వాక్‌ చేసి అందరి మనసులు దోచుకున్నారు. ఎంతో ఆకర్షణీయంగా కనిపించే వస్త్రాలు ధరించిన యువతులు అక్కడ ఉన్నవారిని ర్యాంప్ వాక్​తో అలరించారు. సుమారు 50 మంది అభ్యర్థులు తమ ప్రదర్శనలతో న్యాయ నిర్ణేతలను ర్యాంప్ వాక్​తో మెప్పించారు. యువతులు తమదైన శైలిలో సాంప్రదాయమైన చీరకట్టుతో తమ హావాభావాలతో ర్యాంపుపై నడుస్తూ కనిపించారు. ప్రొఫెషనల్ మోడళ్లకు ఏ మాత్రం తీసిపోనట్టుగా చేసిన వాళ్ల ప్రదర్శన అందరినీ అబ్బుర పరచింది. అంతే కాకుండా వాళ్లు రకరకాల పాశ్చాత్య దుస్తులతో ర్యాంప్ వాక్ చేసి అందరినీ మెప్పించారు.  

ABOUT THE AUTHOR

...view details