ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎం జగన్ దూరం నుంచే పంటలను పరిశీలించారు - తమను ఎవరు ఆదుకుంటారు! బోరున విలపించిన మిర్చి రైతు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 4:03 PM IST

Updated : Dec 9, 2023, 4:45 PM IST

Mirchi Farmers Crying

Mirchi Farmers Crying Due to Michaung Cyclone: మిగ్​జాం తుపాన్​ కన్నీరు మిగల్చిందని రోదిస్తున్న రైతులకు భరోసా కల్పించేందుకు, సీఎం జగన్​ ఆ ప్రాంతంలో పర్యటనకు వస్తున్నారని తెలిసి, రైతుల్లో ఆశలు చిగురించాయి. తమ కష్టాలను సీఎం జగన్​తో చెప్పుకొని, తమను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని విన్నవించుకోవాలనుకున్నారు. సీఎం రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. సీఎం జగన్ ఆ ప్రాంతంలో పర్యటించినప్పటికి తమ సమస్యలు వినకుండానే వేనుదిరిగాడంటూ, అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

 మిగ్ జామ్ తుపాన్ దాటికి పంట మెుత్తం నట్టేట మునిగిందంటూ, బాపట్ల జిల్లా రైతులు బోరున విలపిస్తున్నారు. సీఎం జగన్ దూరం నుంచి నష్టపోయిన పంటలను పరిశీలించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్చూరు మండలం చెరుకూరులో ఐదు రోజులుగా నీళ్లల్లో నానుతున్న మిరప పంటను చూసి రైతు బావురుమంటున్నారు. కౌలుకు తీసుకుని వేలాది రూపాయలు ఖర్చుచేసి వేసిన మిర్చి పంట చేతికొచ్చే సమయంలో నష్టాన్ని మిగిల్చిందంటూ, రైతు కారుమూరి వెంకట్రావు రోధిస్తున్న తీరు అందరిని కంటతడిపెట్టించింది.

Last Updated :Dec 9, 2023, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details