ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సామాజిక సాధికారతను జగన్ చేతల్లో చూపించారు : మంత్రి విడదల రజిని

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 10:08 AM IST

Minister Vidadala Rajini

Minister Vidadala Rajini  సీఎం జగన్ సామాజిక సాధికారతను చేతల్లో చేసి చూపించారని ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా ఏలూరు జిల్లా కైకలూరు సంతమార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో పరిపాలన జగన్ మోహన్ రెడ్డికి ముందు ఆ తర్వాత అనే విధంగా కొనసాగుతోందని.. మంత్రి తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు సామాజిక అంటరాని తనాన్ని పెంపొందించారని ఆమె ఆరోపించారు. 

 ఈ బహిరంగ సభ ఏర్పాటు కోసం కైకలూరు-భీమవరం 165వ  జాతీయ రహదారిని మూసివేయడంతో పలువురు ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సభ ఏర్పాటు దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపులో భాగంగా అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆర్టీసీ బస్సులకు రూట్ మ్యాప్ ఇవ్వకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. మరోవైపు సభను విజయవంతం చేయాలనే క్రమంలో డ్వాక్రా సంఘాలు, వాలంటీర్లతో పెద్ద ఎత్తున తరలించిన మహిళలు.. సభ ప్రారంభానికి ముందే వెళ్లిపోవడంతో అతిథులు అందరూ ప్రసంగించకుండానే సభను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details