ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐటీ టవర్స్‌ను ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకుంటే తప్పేంటి?: మంత్రి అమర్‌నాథ్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 10:41 AM IST

minister_gudivada_amarnath

Minister Gudivada Amarnath On Boat And It Towers:విశాఖ పోర్టులో బోటు అగ్నిప్రమాదానికి జరిగిన 72 గంటల్లోనే పరిహారం అందించామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాధ్ అన్నారు. ఇది ప్రభుత్వ చిత్త శుద్దికి నిదర్శమని చెప్పిన ఆయన అన్నారు. జనసేన, టీడీపీ పరిహారం అంటూ హడావుడి చేస్తున్నాయని విమర్శించారు. అలానే వారు మళ్లీ తిరిగి వారి పనులు చేసుకునే వరకు ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందిచామని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, హుద్ హుద్ తుపాన్​కి ప్రకటించిన పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. విశాఖలో ఐటి టవర్స్​ను ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అలానే సీఎం ఒక చోటునుంచే పరిపాలించాలని ఎక్కడా లేదు రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పరిపాలించ వచ్చు అదే విధంగా సీఎం జగన్ త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తారని అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్నిఎవ్వరూ ప్రశ్నించజాలరనే వితండ వాదాన్ని తెరపైకి తెచ్చారు.

ABOUT THE AUTHOR

...view details