ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Minister Amarnath: హరిరామ జోగయ్యపై మంత్రి అమర్నాథ్ విసుర్లు.. సీనియర్ ప్యాకేజీ స్టార్ అంటూ...

By

Published : Jul 4, 2023, 10:57 PM IST

గుడివాడ అమర్నాథ్

Minister Amarnath criticized Ex MP Hari Rama Jogayya: మాజీ ఎంపీ హరి రామ జోగయ్యపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్​లో మీడియాతో మంత్రి మాట్లాడారు. పెన్ను, పేపర్ పట్టుకోలేని వ్యక్తి ఎవరో రాసిచ్చిన వాటిపై రామజోగయ్య సంతకాలు పెడుతున్నారని విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీలో ఉండి చిరంజీవినే విమర్శించారని ఆరోపించారు. పవన్​ ప్యాకేజీ స్టార్​ అయితే ఈయన.. సీనియర్​ ప్యాకేజీ స్టార్​గా తయారయ్యారని హరిరామ జోగయ్యను మంత్రి గుడివాడ అమర్నాథ్​ అభివర్ణించారు. వయస్సుకు తగిన పనులు చేస్తే మంచిదని హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డిని విమర్శించే నైతికత లేని వ్యక్తి హరి రామజోగయ్య అని మంత్రి  అమర్నాథ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి ఇష్టమొచ్చినట్లు లేఖ రాయటం సరికాదని విమర్శించారు. వయస్సు పెరిగిన కొద్ది సంప్రదాయాలు, సంస్కృతులు పెరగాలని అన్నారు. పేపర్లు, టీవీల్లో ప్రచారం కోసం ఇష్టం వచ్చిన విధంగా చేయటం సరికాదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details