ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Fire Accident: లారీలో మంటలు చెలరేగి.. క్షణాల్లో దగ్ధమై

By

Published : Apr 19, 2023, 8:17 PM IST

రోడ్డుపై అగ్ని

పల్నాడు జిల్లా  రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెం వద్ద లారీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి - నార్కట్​పల్లి హైవేపై  బొగ్గు లారీ దగ్ధమైంది.  షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించిందని లారీడ్రైవర్ వెల్లడించాడు.  హైవేపై బొగ్గులోడుతో వెళుతున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు.  లారీ నెల్లూరు నుంచి చిట్యాల వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదం నుంచి లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు.  లారీలో నుంచి మంటలు రావడాన్ని గమనించిన కొందరు లారీ డ్రైవర్​ను అప్రమత్తం చేసినట్లు తెలిపాడు. ఘటనపై పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినట్లు  లారీ డ్రైవర్​ వెల్లడించాడు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన ప్రదేశానికి చేరుకుని.. ఎగిసి పడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. లారీలో షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి గల కారణం అని చెబుతున్నప్పటికీ..  ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details