ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Triple IT: నార్వే దేశంతో కర్నూలు ట్రీపుల్ ఐటీ అంతర్జాతీయ ఒప్పందం

By

Published : May 1, 2023, 7:41 PM IST

Kurnool Triple IT

Kurnool Triple IT: కర్నూలులోని ట్రీపుల్ ఐటీ మొదటిసారి అంతర్జాతీయ ఎంఓయూ చేసుకుందని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సోమయాజులు తెలిపారు. కర్నూలు ట్రిపుల్ ఐటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్) కళాశాల నార్వే దేశానికి చెందిన అగ్దర్ (UIA) యూనివర్సిటీతో ఎంఓయూ (మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్) చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్సైంజ్ ప్రోగ్రాం, జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రాం, జాయింట్ వర్క్ షాప్, జాయింట్ టీచింగ్ జరుగుతుందని డైరెక్టర్ సోమయాజులు తెలిపారు. 

మాస్టర్స్​ స్టూడెంట్స్​.. మొదటి రెండు సెమిస్టర్లు నార్వేలో తర్వాతి రెండు సెమిస్టర్లు కర్నూలులో చదవాలన్నారు. ఈ సంవత్సరం ఎంటెక్​లో నూతనంగా ఆరు ప్రొగ్రామ్స్ ప్రారంభించామని.. వీటిలో మూడు నార్వే యునివర్సిటీకి అనుగుణంగా రూపొందించామని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ తెలిపారు. ఈ ఒప్పందం ఐదు సంవత్సరాలు ఉంటుందని దీని ద్వారా రెండు దేశాల సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఉపయెగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అగ్దర్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ మొన స్కోఫ్టేలాండ్ జిస్లేఫాస్, ఫ్రోఫెసర్ లింగా రెడ్డి పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details